Durga Mata Song Lyrics
- Genre:Folk
- Year of Release:2022
Lyrics
పల్లవి:ఆది నువ్వే అమ్మ నువ్వే మమ్మే పాలించే దేవి భవాని
సర్వం నువ్వే దైవం నువ్వే మమ్మె కాపాడే దుర్గ భవాని
అందరి క్షేమమే కోరే మా మాతవే
జోగులాంబ జగతే నీదే
బాధలు తీర్చేటి మా కల్పవల్లివే
కాళికమ్మ నీ కరునే చాలులే
ఆదిశక్తివమ్మ ఓ భద్రకాళి నువ్వు
ఇలవేల్పుగా కొలిచే మా దైవమా
మహాలక్ష్మివమ్మ శాంకరీదేవీ నువ్వు
శరణు శరణు నీకు భ్రమరాంబికా
చరణం:దగ దగ మెరిసే సూర్యుడినే నువ్వు
కుంకుమ బొట్టలే నీ నుదిటిన నిలిపావు
బగ బగ మండేటి నిప్పుల కాంతులు
క్రోదాన మే చూసే నీ కన్నుల చూపులు
అమ్మల కన్న అమ్మే నువ్వు
లోకాన మేమంతా నీ చంటి పాపలము
కోటి కాంతుల వెలుగుల నీ తేజసము
నీ మోమునందే మేమంతా చూడగలము
చరణం:దేశం నలువైపుల నీవే వెలిసావు
అష్టాదశ పీఠాలుగ వెలుగొందుతున్నావు
శాంతికి నిను మించిన రూపము చూడబోము
కోపం దరిచేరితే శృష్టి అల్లకల్లోలము
పట్టు చీరలు సీసాపు గాజులు
పసుపు కుంకుమతో అలంకరణ చేస్తాము
డుబ్బుల చప్పుడు శివసత్తుల ఆటలు
నిన్నే కొలువుతీర్చ జనమంతా కడులుతము