Warangal Ganesh Song Lyrics
- Genre:Folk
- Year of Release:2022
Lyrics
పల్లవి:
హే ఓరుగల్లులో హోరేత్తె పండగ వచ్చే
గల్లీ గల్లీలో నీ గుడులే వెలిసే
గుండె గుండెకే నచ్చినా దైవమువే
ఏ పూజకైనా ఆది నువ్వే
పల్లె పట్నం తెడలేక,చెందాలేస్తం నీ రాకకు మొదట
చిన్న పెద్ద ఊరు వాడ,చిందులేస్తం నువ్వొచినాక
మామిడి తోరణాలు మస్తుగ తెచ్చి
అరె దీపాల అలంకరణ ముందే చేసి
ప్రేమతో ఉండ్రాళ్ళు దండిగ చేసి
అరె నైవేద్యంగానే సమర్పించమా నీకే
జైజైజై జైజైజై జైజైజై గణేశా
నీ కరునే మాపైన ఉండాలి గజేషా||2||
వెస్తంబాల వాసుడు మీ నాన్న శివయ్య
చౌరస్తాలో పూజలు అలగ్ అలగు లేవయ్యా
Tri cities ఎదురుచూసే పండగే నీదయ్య
ప్రతి ఇల్లు నీదేలే మా బొజ్జ గణపయ్య
సునీల్ టాకీస్ కాడ cutout చూస్తే
నింగిని తాకే ప్రతిమే నీదే
ఖైరతబాద్ నే తలపించే జోరే
బట్టల బజారులో కనిపిస్తాదే
గణగణగణ గణ గణ గణ గణపతి బప్పా మోరియా
ప్రతి చోట అణువణువునా నేవేగా ఉందయ్య
ఏడుకి ఒకసారి మా దరికే వస్తావు
తొమ్మిది రోజులు హవా హవా చేస్తావు
గారెలు బూరెలు ఉండ్రాళ్ళు తేస్తాము
అన్న దానాలు నీ పేరున చేస్తాము
భజనలు మేమే మొదలెట్టినాక
రేయి పగలు పట్టించుకోము
తొమ్మిది రోజులు ఘనముగా ముగిసాక
గుండెలో కన్నిరుని మొస్తాము
మరిమరిమరి మరిమరిమరి నువ్ మాకు కావాలి
ప్రతి రోజు ప్రతి గడియ మాతోనే ఉండాలి