
రైతు Lyrics
- Genre:Acoustic
- Year of Release:2024
Lyrics
వలస పోతున్న ఊరిని ఆపేదెలాగ
గ్రామాలను దేశ పట్టుకొమ్మలు చేసేదెలాగ
ఏడుకొండల మీద ఎంకన్న సామి
యాదగిరిలోన నర్సిమ్మ సామి
కొండగట్టు కాడ అంజన్న సామి
మా ఊరిని కాపాడే పోతురాజుసామి
మము సల్లంగా సూడాలి
మా అండగా మీరుండాలి
దండాలు దండాలు మా సాములోరు
కంచిలో కొలువైన కామాక్షి తల్లి
బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మ
చల్లని చూపుల మధుర మీనాక్షమ్మ
మా ఊరి దైవమైన అమ్మోరు తల్లి
మీ దయ మాపైనుండాలి
మా తోడుగా మీరుండాలి
దండాలు దండాలు మా తల్లులారా
వలస పోతున్న ఊరిని ఆపేదెలాగ
గ్రామాలను దేశ పట్టుకొమ్మలు చేసేదెలాగ
మా ఊరు పాడి పంటలకు నెలవు
ఇపుడంతా పెడుతున్నారు దానికి సెలవు
పాడి పంటతో ఏ లాభం రాకపోతే
ఈ తరం చేయనంటోంది వ్యవసాయం
మన తిండికి ఇంకెవరు చేస్తారు సాయం
వలస పోతున్న ఊరిని ఆపేదెలాగ
పండించిన వారికి ఆస్తులు పెరిగేదెలాగ
ఉన్న ఊరిలో ఏ పని చెయ్యమన్నా నామోషీ
పట్నంలో పర్లేదు అయినా పనిమనిషి
ఊరిని వదిలి, పొలాలు అమ్మేసి పోతే
పంట పొలాలు అవుతున్నాయి వెంచర్లు
ఓ తరం భవితకు పడుతున్నాయి పంచర్లు
వలస పోతున్న ఊరిని ఆపేదెలాగ
పంట సాగుకు యువతను మెప్పించేదెలాగ
అన్నదాత శ్రమించి పండించిన
పంటే కదా అసలైన సంపద
అది లేకుంటే బతికేదెలా
మరే ఆస్తి సంపాదించినా
రైతు వంశం నిర్వీర్యమైతే
మరు తరమంతా దానికి దూరమైతే
ఆ పంటలు పండేదెలా
మన కంచం నిండేదెలా
తినగలమా ఏ ఇతర ఆస్తైనా
వలస పోతున్న ఊరిని ఆపేదెలాగ
రైతన్నను రాజుగా చేసేదెలాగ
లేకుంటే ఉండదు మన తిండికి ఠిఖానా