
పట్నం Lyrics
- Genre:Acoustic
- Year of Release:2024
Lyrics
యాడికచ్చి పడ్డవ్
ఈ లొల్లి ఏందిరయ్య
కారు కదలకచ్చె
మామా బైకు ఉర్కదయ్యె
కారు, బైకు ఇడ్సిపెట్టి
నడ్సుకుంట వోదమంటే
కాలు కదల సోటేది
ఈ ట్రాఫిక్కు జామాయే
మన హైద్రాబాదు రోడ్లన్నీ
మరి నిండు కుండలాయే
కాలు కదల సోటేది
ఈ ట్రాఫిక్కు జామాయే
మన హైద్రాబాదు రోడ్లన్నీ
మరి నిండు కుండలాయే
అట్లిట్ల తండ్లాడి
ఆ పేద్ద రోడ్డెక్కి
ఇగ సంపుకుందమంటే
ఆ లారి మామ అచ్చి
సైడు ఇయ్యనే ఇయ్యడే
మనకాడు అడ్డమే ఐతడే
యాడికచ్చి పడ్డవ్
ఈ లొల్లి ఏందిరయ్య
కారు కదలకచ్చె
మామా బైకు ఉర్కదయ్యె
పోతేవోని సందులిరికి
షార్ట్ కట్ ల గుంజుతుంటే
యాడ జూసినా గుంతలే
లేకుంటే స్పీడూ బ్రేకర్లే
మన నడుమిగ జారుడు జారుడే
యాడికచ్చి పడ్డవ్
ఈ లొల్లి ఏందిరయ్య
కారు కదలకచ్చె
మన బైకు ఉర్కదయ్యె
కారు, బైకు ఇడ్సిపెట్టి
నడ్సుకుంట వోదమంటే
కాలు కదల సోటేది
ఈ ట్రాఫిక్కు జామాయే
ఇల్లు కానరాక పాయే
జల్లు వాన షురు ఆయే
ఇగ రోడ్ల మీద
ఉర్కెనే గంగ
మన బండ్లన్ని గిట్ల
ఓడలెట్ల గాకపాయె
రానేరాను ఓరయ్యో
ఈడకెల్లి ఇగ ఇల్లిడ్సి
పోనేవోను తల్లో
మన పట్నపు రోడ్లను తల్సి
ఇల్లు కానరాక పాయే
జల్లు వాన షురు ఆయే
ఇగ రోడ్ల మీద
ఉర్కెనే గంగ
మన బండ్లన్ని గిట్ల
ఓడలెట్ల గాకపాయె
రానేరాను ఓరయ్యో
ఈడకెల్లి ఇగ ఇల్లిడ్సి
పోనేవోను తల్లో
మన పట్నపు రోడ్లను తల్సి