
కలల తీరమై Lyrics
- Genre:Acoustic
- Year of Release:2024
Lyrics
కలల తీరమై నన్ను చేరవే
ఎదను మీటుతూ ప్రేమ పంచవే
చిన్ని గుండె ఆశలనే
ఆలకించి, చిగురించ రావే
కలల తీరమై నన్ను చేరవే
ఎదను మీటుతూ ప్రేమ పంచవే
ప్రేమనే ఈ వెన్నెలలో
నా మది నిను తలచెనులే
నీవనే ఆ భావనలో
మనసులే జత కలిసెనులే
వానవిల్లులా ఇలా ఇలా
నీవు నన్ను చేరగా
స్వప్నలోకమే ఇలా ఇలా
ఇలను వచ్చి వాలదా
కలల తీరమై నన్ను చేరవే
ఎదను మీటుతూ ప్రేమ పంచవే
నీవనే ఒక పరిమళమే
నిండెనే నా శ్వాసలలో
నీడనే ఇక నీవైనావె
నాదనే ఈ లోకములో
నింగి నేల సాక్షిగా
మనం కలిసి సాగగా
కలతలన్ని తీరవా
ప్రేమ తోడు నీడగా
కలల తీరమై నన్ను చేరవే
ఎదను మీటుతూ ప్రేమ పంచవే
చిన్ని గుండె ఆశలనే
ఆలకించి చిగురించ రావే
కలల తీరమై నన్ను చేరవే