
Jeevitham Lyrics
- Genre:Acoustic
- Year of Release:2024
Lyrics
కామి గాక మోక్షగామి గాలేడు
ఈ మనిషి భవబంధాలు వీడలేడు
తప్పించుకోలేడు
విశ్వదాభిరామ వినుర వేమా
మనిషి జన్మ అంటేనే ఇంతేనా
కత్తి మీదా సామేరా ఈ జీవితం
నువు తేల్చలేవు దీని పరమార్థం
నువు ఎంత గింజుకున్నా, ఎంతెంత పోగేసుకున్నా
నీకేమైనా ఒరిగేనా, ఆ మరు లోకాన
మరి ఎందుకు నీకీ పాకులాట
ఎవరిని గెలిచేందుకీ ఉబలాటం
ఉన్నప్పుడే, బతికున్నప్పుడే
అనుభవించు ఈ చిన్ని జీవితం
చేజారనీయకు ఈ సమయం