![NEE MELULU VIVARIMPATHARAMA](https://source.boomplaymusic.com/group10/M00/10/29/ddd8a2bf70844d87a480f4df3fa248e3_464_464.jpg)
NEE MELULU VIVARIMPATHARAMA Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
నీ మేలులు వివరింపతరమా ప్రభువా
నీ కృపలను నే మరువగలనా
ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో నీ జాలి మనసుతో
శోధనలే నన్ను వెన్నంటియున్నా బహు శ్రమలతో నేను
సతమతమవుతున్నా
నను ధైర్యపరచి నడిపించినావే
నా హృదయవేధన తొలగించినావే
ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో నీ జాలి మనసుతో
ఊహించలేని కార్యాలు ఎన్నో
లెక్కించలేని పర్యాయములలో
నా జీవితంలో జరిగించినావే
నీ క్రుపతో నిత్యము దీవించినావే
ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో నీ జాలి మనసుతో
మరచిపోలేని నీ మేలులెన్నో
దయచేసినావు నా జీవితములో
నీ ప్రేమకు సాటి లేదేమి ఇలలో
నీ కరుణకు బదులు ఏముంది ధరలో
ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో నీ జాలి మనసుతో
నీ మేలులు వివరింపతరమా ప్రభువా
నీ కృపలను నే మరువగలనా